Ambulance: చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం క్రిష్ణజిమ్మాపురం పంచాయతీ కొండం ఆదిఆంధ్రవాడ గ్రామానికి చెందిన వెంకటేశ్ (45) సోమవారం మేకల మేతకోసం చెట్టెక్కి కిందపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. 3 గంటలు దాటినా గ్రామానికి అంబులెన్స్ రాలేదు. ఆ తర్వాత చిత్తూరు నుంచి ఇప్పుడే బయలుదేరామని.. రావడానికి గంటకుపైగా పడుతుందని అంబులెన్స్ సిబ్బంది గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. అప్పటిదాకా వెంకటేశ్‌ను మంచంపై ఉంచి వేచి చూసిన కుటుంబీకులు.. మరో గంట ఆగితే కష్టమని భావించి.. రూ.4వేలు అప్పు చేసి ఆయనను ప్రైవేటు వాహనంలో రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి:
Ambulance: 3 గంటలైనా రాని అంబులెన్స్...ప్రైవేటు వాహనమే దిక్కు..! - సమాచారం అందించినా అంబులెన్స్ రాలేదు
Ambulance: ఆపదలో ఆదుకోవాల్సిన అంబులెన్స్ (108) సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేదు. ఫలితంగా ఓ క్షతగాత్రుడు ప్రాణాపాయ స్థితిలో 3 గంటలకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. చివరికి క్షతగాత్రుడి తరలింపునకు ప్రైవేటు వాహనమే దిక్కైంది.