రైల్వేశాఖ చేపట్టిన ఓ ప్రయోగాన్ని విజయవంతం చేసే బాధ్యత వారందరి మీదా పడింది. అంతమాత్రాన ఒత్తిడికి తలొగ్గలేదు. ఏం జరుగుతుందోనని బెంగపడలేదు. కీ ఉమన్ నుంచి సూపరింటెండెంట్ దాకా ఓ రైల్వేస్టేషన్‌లోని బాధ్యతలన్నీ చేపట్టిన అతివలు.... మగవారికి తీసిపోని విధంగా తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దక్షిణాదిన తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన చంద్రగిరిపై ప్రత్యేక కథనం.
14 విభాగాల బాధ్యతలు...
మహిళా సాధికారతే లక్ష్యంగా రైల్వేశాఖ కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న మగువలు... సత్తా చాటుతున్నారు. దక్షిణ భారతంలో... తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా పేరొందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి స్టేషన్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న ఈ స్టేషన్‌లో సూపరింటెండెంట్, ముగ్గురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు సహా.... 14 విభాగాల బాధ్యతలు మహిళలే చూసుకుంటున్నారు.
ఆ స్టేషన్ వద్ద ఏరోజూ సమస్య రాలేదు..
మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురైనా.... ఉన్నతాధికారుల సహకారంతో అన్నింటికీ అలవాటు పడ్డామని చంద్రగిరి రైల్వేస్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. రైళ్ల రాకపోకల్లో చంద్రగిరి స్టేషన్ వద్ద ఏనాడూ ఇబ్బంది ఎదురవలేదని.... ఈ మార్గంలో వెళ్లే గార్డులు చెబుతున్నారు. చంద్రగిరి స్టేషన్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా..... రైల్వేశాఖ ప్రయోగాన్ని మహిళలు విజయవంతం చేశారు.
ఇదీ చూడండి: నేడు అప్పికట్ల జోసెఫ్ 25వ వర్ధంతి.. ఆయన పేరిట తపాలా కవరు, స్టాంపు ఆవిష్కరణ..