ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థినులు క్షేత్రస్థాయి పరిశీలనకు చిత్తూరులోని కలికిరి ప్రాంతానికి వచ్చారు. పంట విత్తనాల దశ నుంచి కోత దశ వరకు రైతులు ఎదుర్కొనే పరిస్థితులను గమనించారు. రైతులు ఆచరించే పద్ధతులు, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, నివారణ తదితర అంశాల గురించి వారితో చర్చించారు. రైతులకు తెగుళ్ళను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలపై అవగాహన లేదని తెలుస్తుందన్నారు. విత్తనాల నుంచి క్రిమిసంహారక మందు పిచికారి వరకు దుకాణదారులు సలహాలను పాటిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఎక్కువమంది రైతులు పాడి పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నట్లు వివరించారు. తీవ్ర వర్షాభావం వల్ల రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు వారు తెలిపారు. మూడు నెలలపాటు క్షేత్రస్థాయిలో వివిధ పనులపై పరిశీలన చేయనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఈనాడు-కేఎల్ వర్శిటీ ఆధ్వర్యంలో దశ-దిశ