నటుడు సోనూసూద్ సాయం.. ఎల్లలు దాటుతోంది. కష్టం పేరు వినిపిస్తే.. అక్కడ సోనూసూద్ నేనున్నానంటూ.. భరోసా ఇస్తున్నాడు. ఎంతో మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపి.. తన మానవత్వాన్ని చాటుకున్న అతడు.. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబానికి ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చాడు.
-
This family doesn’t deserve a pair of ox 🐂..
— sonu sood (@SonuSood) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD
">This family doesn’t deserve a pair of ox 🐂..
— sonu sood (@SonuSood) July 26, 2020
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jDThis family doesn’t deserve a pair of ox 🐂..
— sonu sood (@SonuSood) July 26, 2020
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD
చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు... తన పొలం దున్నడం కోసం... కుమార్తెలే కాడెద్దులుగా మారిన వీడియోపై సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ట్విట్టర్ లో తనను ట్యాగ్ చేస్తూ కృష్ణమూర్తి అనే వ్యక్తి పోస్ట్ చేసిన రైతు కష్టం వీడియోకి... సోనూసూద్ సమాధానమిచ్చాడు. ఆ రైతును ఆదుకునేలా... రెండు ఎద్దులను కొనిస్తానని హామీ ఇచ్చి.. కాసేపటికే.. ఎద్దులకు బదులుగా ట్రాక్టర్ కొనిస్తానని ప్రకటించాడు. రేపే ఆ కుటుంబానికి అందించనున్నట్లు తెలిపాడు. రైతు కుమార్తెలు చదువుపై దృష్టి సారించాల్సిందిగా సోనూ కోరాడు.
నాగేశ్వరరావు అనే రైతు పొలం దున్నేందుకు సాయంగా అతని ఇద్దరు కుమార్తెలు కాడెద్దులుగా మారిన వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కరోనా ప్రభావంతో అద్దెకు ట్రాక్టర్లు దొరక్క.. కూలీలు రాక సన్నకారు రైతు అయిన తమ తండ్రికి సాయంగా.. కుమార్తెలే కాడెద్దులుగా మారారు. ఇప్పుడు సోనూ వారికి సహాయం అందిస్తానని ప్రకటించడంతో... సామాజిక మాధ్యమాల్లో అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. లాక్డౌన్ సమయంలో... ఎంతోమంది వలస కూలీలను తన సొంత ఖర్చులతో.. విమానాల్లో బస్సులో ఇంటికి పంపించి సోనూసూద్ ఇప్పటికే వారందరి పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచి.. మానవత్వాన్ని చాటుకున్నాడు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: వరదలో కారు- తెగించి కాపాడిన జనం