ETV Bharat / state

Bribe: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ఎఫ్‌ఆర్‌వో - chittoor district updates

అనిశాకు చిక్కిన ఎఫ్‌ఆర్‌వో
FRO Venugopal babu
author img

By

Published : Sep 13, 2021, 5:20 PM IST

Updated : Sep 13, 2021, 8:25 PM IST

17:15 September 13

లంచం తీసుకుంటూ ఓ ఎఫ్​ఆర్​వో.. ఏసీబీకి పట్టుబడ్డాడు. చిత్తూరు జిల్లాలో క్వారీ ఏర్పాటుకు సంబంధించి ఎన్​వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద నుంచి ఎఫ్​ఆర్​వో లంచం డిమాండ్ చేశాడు. చెల్లించుకోలేని ఆ వ్యక్తి ఏసీబీకీ ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలో నగదు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

క్వారీ ఏర్పాటుకు సంబంధించి ఎన్​వోసీ పత్రం ఇవ్వడానికి లంచం తీసుకుంటూ.. చిత్తూరు పశ్చిమ విభాగం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ బాబు అ.ని.శా అధికారులకు పట్టుబడ్డాడు. గుడిపాల మండలం, తిమ్మేపల్లె గ్రామంలో క్వారీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మొదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ టీజీ సురేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో క్వారీ ఏర్పాటుకు నిరభ్యంతర పత్రం ఇవ్వడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి వేణు గోపాల్ బాబు రూ.3.50 లక్షలు లంచం డిమాండ్ చేశారు. రూ.రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీనిపై టీజీ సురేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.  ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం టీజీ సురేష్ వద్ద పనిచేసే  మేనేజర్ భరత్.. రూ.రెండు లక్షలు  తీసుకుని చిత్తూరు నగరంలోని రిజర్వ్ ఫారెస్ట్ కార్యాలయంలో ఉన్న వేణుగోపాల్ బాబుకు అందజేస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన వేణు గోపాల్ బాబును అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ జనార్దన్ నాయుడు వెల్లడించారు.

ఇదీ చదవండి

WONDER: పిల్లి పిల్లలకు పాలిస్తున్న శునకం.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

Last Updated : Sep 13, 2021, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.