బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివారు ప్రాంతం ఈశ్వరమ్మ కాలనీ వద్ద జరిగింది. పట్టణంలోని వాల్మీకి వీధికి చెందిన శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్ళాడు. మద్యం మత్తులో ఉన్న ఇతను బావిలో దూకే ప్రయత్నంలో.... ప్రమాదవశాత్తు బావిలోని మెట్లపై పడి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికి తీశారు.
ఇవీ చదవండి: