పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాలేదని భర్త కక్ష పెంచుకున్నాడు. మాట్లాడాలని ఊరి బయటకు పిలిచి విచక్షణా రహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధిత మహిళ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీ ఆరిమాకులపల్లి ఎస్సీ కాలనీలో ఈ దారుణం జరిగింది.
నియోజకవర్గ పరిధిలోని సాతంబాకం పంచాయతీ రామాపురం కాలనీకి చెందిన సతీష్, ఆరిమాకులపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నాగమ్మను కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదట్లో కాపురం బాగానే సాగింది. గత కొన్నిరోజుల నుంచి భార్యపై సతీష్ అనుమానం పెంచుకుని వేధించేవాడు. ఈ పరిణామాలతో ఇద్దరు పిల్లల్ని వదిలి నాగమ్మ పుట్టింటికి చేరుకుంది. కాపురానికి రావాలంటూ సతీష్ కోరుతున్నా ఆమె నిరాకరించింది. ఈరోజు భార్యకు ఫోన్ చేసిన సతీష్.. మాట్లాడుకుందాం రమ్మంటూ గ్రామ శివారు వద్దకు పిలిచాడు. అక్కడకు వచ్చిన నాగమ్మతో వాగ్వాదానికి దిగిన సతీష్... విచక్షణ కోల్పోయి పక్కనే ఉన్న పూరిగుడిసెలోని కత్తి తీసుకుని ఆమె కాళ్లను నరికాడు. తీవ్రగాయాలపాలైన నాగమ్మ కేకలు వేయటంతో స్థానికులు వచ్చారు. వారిని చూసిన సతీష్ పరారయ్యాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమ్మను బంధువులు చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించటంతో వేలూరు తరలించారు. భార్యపై దాడి చేసిన అనంతరం సతీష్ స్థానిక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
ఇదీ చదవండి
కాపురానికి రాలేదని భార్య కాళ్లు నరికాడు! - చిత్తూరు జిల్లా క్రైమ్ వార్తలు
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కాపురానికి రాలేదని భార్యపై కక్ష పెంచుకున్న భర్త... మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది.