చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. రైల్వే ట్రాక్ పరిశీలనకు వెళ్లిన గ్యాంగ్మెన్ఎర్రగుంటపల్లి సమీపంలోని రైల్వేట్రాక్‌పై మృతదేహాలను గుర్తించి.. గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోదా చేసి... అక్కడ లభించిన ఏటీఎం, చరవాణీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతులు చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన శివకుమార్ (24), పీలేరు పట్టణం కావలిపల్లికి చెందిన సాయి(23)గా గుర్తించారు. సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :