సార్వత్రిక ఎన్నికల వేళ మరో సీఐపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. తాడిపత్రి సీఐ బీవీ నారాయణ రెడ్డిని... సీఈవో గోపాల కృష్ణ ద్వివేది బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఐగా శరత్ చంద్రను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రూ.106 కోట్లు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసిన ఈసీ... ఇప్పటివరకు రూ.106 కోట్లను స్వాధీనం చేసుకుంది. నగదు వివరాలను ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని తెలిపారు. నగదుతో పాటు... మొత్తం రూ. 22 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పాడేరు, అరకులో పోలింగ్ కేంద్రాల మార్పు
పాడేరు, అరకులోని 14 పోలింగ్ కేంద్రాలను తరలించాలని ఈసీ నిర్ణయించింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు కాబట్టి... పోలింగ్ కేంద్రాలను తరలించినట్లు తెలిపారు. సాయుధ బలగాల కొరతపై కేంద్రానికి లేఖలు రాస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు.
తాడిపత్రి సీఐపై ఈసీ వేటు.. బదిలీ చేస్తూ ఉత్తర్వులు - EC
సార్వత్రిక ఎన్నికల వేళ మరో సీఐపై రాష్ట్ర ఎన్నికల సంఘం వేటువేసింది. తాడిపత్రి సీఐ బీవీ నారాయణ రెడ్డిని బదిలీ చేస్తూ, ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త సీఐగా శరత్ చంద్రను నియమించారు.