ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ పరికరాలు ఫలితాల వెల్లడిని ఆలస్యం చేయనున్నాయి. ఈవీఎంల కౌంటింగ్ ముందే పూరైపోయినా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీవీ ప్యాట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితాలను వెల్లడించాల్సి ఉండటంతో దానికి అదనంగా మరో 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశముంది.
అర్ధరాత్రి దాటే అవకాశం....
రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రజలంతా అత్రుతగా ఎదురు చూస్తున్న మే 23 తేదీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆసలస్యం కానుంది. పూర్తి ఫలితాలు వెల్లడి అయ్యేసరికి అర్ధరాత్రి 12 గంటలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 10-12 గంటల సమయానికి లీడ్ తెలిసినా వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు మాత్రం ఆలస్యం కానుంది. సుప్రీం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలోని 35 పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్లు బ్యాలెట్ యూనిట్లలోని ఓట్లు లెక్కిస్తారు.
ఐదు బూత్‌ల్లో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు...
ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలలోని ఓట్లను మొదట లెక్కిస్తారు. రౌండ్లవారీగా ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 5 బూత్‌లలో వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కిస్తారు. ఇది లెక్కించడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని ఎన్నికల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదే..
ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్‌లకు మధ్య కొన్ని సందర్భాల్లో వ్యత్యాసం ఏర్పడే అవకాశముంది. ఇలాంటి సందర్భాలు ఎదురైతే తప్పిదం ఈవీఎంల్లో ఉన్నట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయంలో ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పష్టత లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈవీఎంతో వీవీప్యాట్ స్లిప్ లెక్క సరిపోకుంటే...! - రాత్రి 12 గంటల వరకు లెక్కింపు
రాష్ట్ర ప్రజానీకమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు మొదలుపెట్టింది. అయితే కిందటిసారి కంటే ఈసారి మాత్రం ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీవీ ప్యాట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితాలను వెల్లడించాల్సి ఉండటంతో గెలుపోటముల తెలియాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.