ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేర్చేందుకు నియమించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ల విద్యార్హతో ప్రభుత్వం సవరణలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో గతంలో డిగ్రీ చదివిన వాళ్లే దీనికి అర్హులని ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ అర్హతల్లో మార్పులు చేసింది. ఇంటర్ చదివిన వ్యక్తులూ వార్డు వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. విద్యార్హతలో మార్పులు చేసినందున... దరఖాస్తు గడవునూ పెంచింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్న వాళ్లు ఈనెల పదో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు వివరాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: