ETV Bharat / state

వైకాపాకు 5 గంటలు.. తెదేపాకు 53 నిముషాలే

శాసనసభలో బడ్జెట్​పై చర్చ ఆరు గంటల సమయాన్ని కేటాయించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయించారు. వైకాపాకు 5 గంటల సమయం కేటాయించారు. తెదేపాకు 53 నిమిషాల నిడివి ఇచ్చారు. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చర్చను ప్రారంభించారు.

author img

By

Published : Jul 16, 2019, 1:44 AM IST

బడ్జెట్​కు ఆరు గంటల సమయం కేటాయింపు

శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా.. సభాపతి తమ్మినేని సీతారం.. పార్టీలకు సమయం కేటాయించారు. రోజులో బడ్జెట్‌పై చర్చకు ఆరు గంటల సమయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైకాపాకు ఐదు గంటల ఏడు నిమిషాల సమాయాన్ని కేటాయించగా... తెలుగుదేశానికి 53 నిమిషాలు ఇచ్చారు.

శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా.. సభాపతి తమ్మినేని సీతారం.. పార్టీలకు సమయం కేటాయించారు. రోజులో బడ్జెట్‌పై చర్చకు ఆరు గంటల సమయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైకాపాకు ఐదు గంటల ఏడు నిమిషాల సమాయాన్ని కేటాయించగా... తెలుగుదేశానికి 53 నిమిషాలు ఇచ్చారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_15_Tripul_Murder_AVB_AP10004


Body:అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటలో ఘాతుకం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని శివాలయంలో లో నిద్రిస్తున్న ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశారు. శివాలయం కొత్తగా నిర్మిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు శివరామిరెడ్డి, ఆయన సోదరి కమలమ్మ, మరో మహిళ సత్యలక్ష్మి గుడి ఆవరణలోనే హత్య చేశారు. మహిళలు ఇద్దరిని గొంతు కోసి రక్తాన్ని శివలింగం పైన, సమీపంలోని పుట్టలపైన చల్లారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇతరులతో ఎలాంటి గొడవలు లేవు. ఉద్యోగ విరమణ తర్వాత శివరామిరెడ్డి శివాలయం నిర్మాణం కోసం అం నిధులు సేకరించడం, ఆలయం అభివృద్ధి కోసం రేయింబవళ్ళు అక్కడే ఉండి పోయారు. ఆయనకు తోడుగా శివరామిరెడ్డి అక్క కమలమ్మ ఉంటున్నారు. కొత్తకోట గ్రామానికి చెందిన సత్య లక్ష్మి బెంగళూరులో స్థిరపడ్డారు. గురు పౌర్ణమి వేడుకల కోసం గ్రామానికి వచ్చిన సత్య లక్ష్మి ఆదివారం రాత్రి గుడి వద్దకు వెళ్లి అక్కడే నిద్రించారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని హత్య చేసి ఉంటారని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. శివాలయ నిర్మాణంతో పాటు, ఆలయ పరిసరాలలో ఉన్న ప్రభుత్వ భూమి ఆలయానికి చెందేలా హక్కులు కల్పించాలని అధికారులకు అధికారులను శివరామిరెడ్డి కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు మూడెకరాల భూమి ఆలయానికి కేటాయించాలన్న అభిప్రాయాన్ని కొందరు వ్యతిరేకించినట్లు సమాచారం. గుప్తనిధుల కోసం వచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటే హతుల వద్ద ఉన్న నగదు, బంగారు అభరణాలు ఎత్తుకెళ్లే వారినే అభిప్రాయం వినిపిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో అణువణువు గాలించారు. హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి కేసును ఛేదిస్తామని
కదిరి డి.ఎస్.పి శ్రీనివాసులు తెలిపారు.


Conclusion:బైట్స్
నాగముని, స్థానికుడు
శ్రీనివాసులు, డిఎస్పీ, కదిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.