డేటా చోరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి, ఆధార్ సంస్థకు.. తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ... ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ న్యాయస్థానంలో మరోసారి విచారణ జరిగింది. ఆధార్ దుర్వినియోగం అయిందా లేదా.. ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయా లేదా అనే విషయంపై వివరణ కోసం ఈసీ, ఆధార్ సంస్థలను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. పిటిషన్ విచారణ అర్హత, ఇతర అంశాలపై తర్వాత వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఈసీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు
డేటా చోరీ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి, ఆధార్ సంస్థకు.. తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.