రాజకీయ పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది భేటీ అయ్యారు. జిల్లాల్లో ఈవీఎంల మొదటి దశ తనిఖీల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. జనవరి వరకు 3.69 కోట్ల మంది ఓటు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందన్నారు.
నకిలీ ఓటరు జాబితాపై 15 రోజుల్లో స్పష్టతనిస్తామన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ వరుసలు లేకుండా టోకెన్ పద్ధతి తీసుకొస్తామన్నారు.
రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు నిండినవారు 18 లక్షలమంది ఉన్నారన్నారు. అందులో 5.5 లక్షల మందే ఓటు నమోదు చేసుకున్నారని ద్వివేది చెప్పారు. మిగిలిన వారూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.