ETV Bharat / state

2021 నుంచి కృష్ణా తీరంలో గోవింద నామస్మరణ!

సప్తగిరులపై ప్రకాశించే వైకుంఠవాసుడు...వెంకటపాలెం రాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న శంఖచక్రధరుడు.... నవ్యాంధ్ర రాజధానికి తలమానికంగా నిలిచే శిల్పకళాంకృతమైన పవిత్ర క్షేత్రంలో కొలువుదీరనున్నాడు. పాతికెకరాల ప్రాంగణంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు.

author img

By

Published : Jul 1, 2019, 7:33 AM IST

sri_venkateshwara_temple_construct_at_amaravathi
2021 నుంచి కృష్ణా తీరంలో గోవింద నామస్మరణ!

ఏడంతస్తుల మహారాజగోపురం, ఐదంతస్తుల రాజగోపురం, ఉత్సవ మండపాలు, మాడవీధులు, కల్యాణమండపం, అద్దాల మండపంలో తిరుమలేశుడు అమరావతిలో కనిపించనున్నాడు. దేవదేవుడిని ప్రజల చెంతకే తీసుకెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చాలా చోట్ల ఆలయాలు నిర్మిస్తూ... స్వామివారి కైంకర్యాలను చేస్తారు. అలా తిరుమల క్షేత్రమే తరలివచ్చిందా? అనేలా రాష్ట్ర రాజధానిలో కృష్ణా తీరాన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం జరుగుతోంది.

25 ఎకరాల్లో కనువిందు
గతేడాది ఆగస్టు 28న అమరావతిలో 150కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టాలని అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద 25 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చోళులు, చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలిలో రూపొందించిన ఆలయ నమూనా తితిదే విడుదల చేసింది.

అద్భుత కట్టడాలు!
కాశ్యప శిల్పశాస్త్రం, మానసరం లాంటి వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఆలయ నమూనా రూపొందించారు. అడుగడునా శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా నిర్మాణం రూపుదిద్దుకోనుంది. మొత్తం 5భాగాలుగా విభజించి పనులు చేపడుతున్నారు. 36 కోట్ల వ్యయంతో అంతర ప్రాకారం పనులు మొదలుపెట్టగా... ఇప్పటి వరకు 3కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. 25 కోట్ల రూపాయలతో వెలుపలి ప్రాకార నిర్మాణం జరగబోతోంది. 37కోట్లతో ఉత్సవమండపం, ఐదంతస్తుల రాజగోపురం నిర్మించనున్నారు. అనంతరం 32కోట్ల వ్యయంతో ఆలయ ముఖద్వారం వద్ద ఏడంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, హనుమంతుడి ఆలయం, పుష్కరిణి నిర్మాణం చేపట్టాలని అంచనా వేశారు. కల్యాణ మండపం, మాడవీధుల నిర్మాణం జరగబోతున్నాయి.

అమరాతిలో ఆలయ నిర్మాణానికి ఒకటిన్నర నుంచి రెండేళ్లు పడుతుందనే అంచనాతో... రెండేళ్లకు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకుంది తితిదే. ఆ ఒప్పందం ప్రకారమే... 5 విభాగాలుగా జరుగుతున్న ఆలయ నిర్మాణం పనులు... వచ్చే ఏడాది డిసెంబర్ లేదా 2021 తొలిమాసాల్లో పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Delhi, June 30, ANI: Kriti Sanon who completed the filming of her upcoming film 'Panipat' on Sunday is all praises for her co-actor Arjun Kapoor and director Ashutosh Gowariker. The 'Luka Chuppi' actor posted a picture of herself and Arjun on Instagram. The picture shows her covering Arjun's mouth with both her hands. While she smiles, Arjun seems to be making an effort to speak. "There is no other way of shutting him up!! Haha," reads the caption. In another picture, she can be seen seated with Ashutosh. Expressing her gratitude to the director for giving her opportunity to be a part of the film, she wrote, "Thank you so much Ashu sir for giving me this opportunity, for always hearing me out and finding Parvati bai with me! You create magic in the calmest manner ever! And I'm honoured to be a part of this magic! @AshGowariker. That's literally us always wondering!" 'Panipat' also stars Sanjay Dutt in the pivotal role. The film is based on the third Battle of Panipat fought between the Maratha empire lead by Sadashiv Rao Bhau and invading forces of Ahmad Shah Abdali, the King of Afghanistan. The film is slated to release on December 6, 2019.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.