జనసేన పార్టీ అధ్యక్షుడు.. నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్లో స్టార్ హీరో పవన్‌కల్యాణ్. సినిమాల్లో ఆయనకున్న స్థాయికి.. శ్రీమంతుడిగానే భావిస్తుంటాం.అయితే పవన్‌కు ఆస్తులెంతో అప్పులూ దాదాపు అంతే ఉన్నాయి. సుమారు 40కోట్ల ఆస్తులుంటే.. అందులో 33కోట్ల మేరకు అప్పులే ఉన్నాయి. ఎక్కువుగా తన స్నేహితులు.. సన్నిహితుల నుంచే వ్యక్తిగత రుణాలు పొందారు.
అప్పులిచ్చింది వీరే..
పవన్‌కు అప్పలిచ్చిన వారిలో ఆయన సన్నిహుతుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. మాటలమాంత్రికుడిదగ్గర పవన్ 2 కోట్ల 40 లక్షల అప్పు పొందారు. తన మిత్రులు సన్నిహితులైన ప్రవీణ్ కుమార్ వద్ద 3 కోట్లు, నవీన్ కుమార్ వద్ద 5 కోట్ల 50 లక్షలు రుణం తీసుకున్నారు, ఎమ్వీఆర్ఎస్ ప్రసాద్ వద్ద 2 కోట్లు అప్పుగా పొందారు. తన సొంత వదిన సురేఖకు పవన్ కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంది.
ఆస్తులు...ఖరీదైన కార్లు
పవన్ మొత్తం స్థిరాస్తులు 40 కోట్ల రూపాయలు. అదంతా పవన్ తన కష్టార్జితంగానే చూపెట్టారు. బ్యాంకుల్లో ఆయన పేరిట 12 కోట్ల రూపాయలు ఉన్నాయి. పనన్ వద్దఖరీదైన వాహనాలున్నాయి. వాటి కోసమే పవన్... బ్యాంకుల నుంచి 68 లక్షల రుణం పొందారు. సుమారు 73 లక్షల విలువ చేసేబెంజ్ కారు, కోటి రూపాయల విలువైన వోల్వో కారు, 32 లక్షల హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది.
ఇవీ చదవండి