ETV Bharat / state

'పసుపు-కుంకుమ'పై జోక్యం చేసుకోలేం: దిల్లీ హైకోర్టు - దిల్లీ హైకోర్టు

పసుపు-కుంకుమ నిధులు ఆపేందుకు జనచైతన్యవేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

పసుపు-కుంకుమ నిధులు ఆపేందుకు దిల్లీ హైకోర్టులో పిటిషన్
author img

By

Published : Apr 5, 2019, 8:43 PM IST

పసుపు-కుంకుమ నిధులు ఆపేందుకు ఆఖరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం, న్యాయస్థానాల్లో కొద్ది రోజులుగా పలువురు పిటిషన్లు వేస్తున్నారు. అన్ని పిటిషన్లను ఈసీ, న్యాయస్థానాలు తోసిపుచ్చాయి. నేడు దిల్లీ హైకోర్టులో జనచైతన్యవేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.

పసుపు-కుంకుమ నిధులు ఆపేందుకు దిల్లీ హైకోర్టులో పిటిషన్

పసుపు - కుంకుమ పథకం అమలుపై దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది విన్పించిన వాదనను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్నందున... లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు పంపడం ఈసీ కోడ్‌ పరిధిలోకి రాదని కోర్టు తెలిపింది.

ఇవీ చదవండి...

ఆస్తి 2జీ స్ప్రెక్టమ్- అప్పులేమో రాష్ట్ర బడ్జెట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.