మహిళలు స్వేచ్ఛగా పూర్తి విశ్వాసంతో ముందుకు వచ్చినప్పుడే ఏదైనా సాధించగలమని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. అప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, సీఐఐ సౌత్ రీజియన్ ఛైర్మన్ దినేశ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ 2.0 ద గ్రోత్ స్టోరీ కంటిన్యూస్ పేరుతో నిర్వహించిన ఈ సమావేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు... పెట్టుబడులను ఆకర్షించటంపై చర్చించారు. వ్యాపారం అనేది విత్తు నాటి మొక్కను పెంచి చెట్టుగా ఎదిగేలా చేయడమన్నారు శైలజా కిరణ్. ఎన్నో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ...శ్రమిస్తే తప్పక సఫలమవుతామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: