స్పందన కార్యక్రమం పేరుతో ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో స్పందన కార్యక్రమం ప్రజలకి మరింత చేరువ చేస్తామన్నారు. వ్యక్తిగత గొడవలకు కొంతమంది రాజకీయ ముద్ర వేస్తున్నారని, అది ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా శాంతి భద్రతల విషయంలో ఎవర్నీ ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. చంద్రబాబుకి కావాలని భద్రత తగ్గించటం లేదని,స్కేల్ ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ మాజీ ముఖ్యమంత్రికి కల్పించామన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సవాంగ్ తెలిపారు.
శాంతిభద్రతల విషయంలో రాజీలేదు: డీజీపీ
స్పందన కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువ చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎవర్నీ ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు.సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తివేయటానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సవాంగ్ తెలిపారు.
స్పందన కార్యక్రమం పేరుతో ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో స్పందన కార్యక్రమం ప్రజలకి మరింత చేరువ చేస్తామన్నారు. వ్యక్తిగత గొడవలకు కొంతమంది రాజకీయ ముద్ర వేస్తున్నారని, అది ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా శాంతి భద్రతల విషయంలో ఎవర్నీ ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. చంద్రబాబుకి కావాలని భద్రత తగ్గించటం లేదని,స్కేల్ ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ మాజీ ముఖ్యమంత్రికి కల్పించామన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సవాంగ్ తెలిపారు.
Body:ఉంగుటూరు
Conclusion:9493990333