IAS Couple Marriage in Visakhapatnam District : ఐఏఎస్ శిక్షణలో ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మనసులు కలిసి పెళ్లి బంధం (Marriage)తో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వరుడి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు కావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. బిళ్లకుర్రుకు చెందిన తరెట్ల ధర్మారావు ఐఏఎస్ అధికారి. ఈయన మధ్యప్రదేశ్ కమిషనర్ స్థాయి వరకు పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. కుటుంబం అక్కడే స్థిరపడింది. ఆయన కుమారుడు తరెట్ల ప్రతీక్‌రావు కూడా తండ్రిలా ఐఏఎస్ సాధించారు. ఆయనకు శిక్షణలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్.కె.శ్రీవాత్సవ్, చిత్రాంజలి దంపతుల కుమారై అనీషాతో 2023లో దిల్లీలో పరిచయం ఏర్పడింది.
పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఆమ్రపాలి - సొంత రాష్ట్రంలో బాధ్యతలు
శిక్షణ అనంతరం ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోనే ఉద్యోగంలో చేరారు. ప్రసుత్తం ప్రతీక్‌రావు ఇటార్సిలోను, అనీషా పిపారియాలోనూ జాయింట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తమ ప్రేమను తల్లి దండ్రులకు తెలియజేయడంతో వివాహానికి ఒప్పుకొన్నారు. ఈ నెల 17న విశాఖపట్నంలో వివాహం జరిపించారు. బిళ్లకుర్రు శివారు తరెట్లవారిపేటలో మంగళవారం విందు ఏర్పాటు చేశారు. వధూవరులు కలెక్టర్లు కావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామస్థులంతా నూతన వధూవరులను సత్కరించారు.