నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ, నదుల పునరుజ్జీవనంలో ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఏపీ మూడో స్థానం దక్కించుకుంది. దిల్లీలో జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవ జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అవార్డులు ప్రదానం చేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, మీడియా సంస్థలకు అవార్డులు అందజేశారు. నీటి నిర్వహణ, యాజమాన్య విధానంలో ఉత్తమ టీవీ ప్రదర్శనల విభాగంలో... 'ఈటీవీ తెలంగాణ'కు రెండో అవార్డు వచ్చింది.
భూగర్భజలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ బహుమతి దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి వచ్చింది. భూగర్భ జలాల పెంపుదలలో ప్రోత్సాహక జిల్లాల విభాగంలో విశాఖ రెండో స్థానంలో నిలిచింది. నదీ పునరుజ్జీవనం విభాగంలో కర్నూలు జిల్లా తొలి స్థానం పొందింది. ప్రోత్సాహక జిల్లాల విభాగంలో కడప జిల్లా అగ్రస్థానం కైవసం చేసుకుంది.