ETV Bharat / state

''వలంటీర్ పోస్టులు.. వైకాపా నేతలు అమ్మేసుకుంటున్నారు'' - grama valunteer interviews

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పీపీఏలు (విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు), గ్రామ వాలంటీర్ల నియామకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

నారాలోకేశ్
author img

By

Published : Jul 14, 2019, 12:03 AM IST

లోకేశ్ ట్వీట్లు
లోకేశ్ ట్వీట్లు

కొన్ని రోజులుగా జగన్ ప్రభుత్వంపై ట్విటర్​లో మండిపడుతున్న లోకేశ్.. మరోసారి ఘాటుగా ట్వీట్లు చేశారు. గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలు సక్రమంగా జరగటం లేదని.. వైకాపా నేతలు వీటిని అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. 'ఉత్తుత్తి ఇంటర్వూలు నిర్వహించి యువతను మోసం చేస్తారా?. ఇందుకేనా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది?. దీనికి స్వచ్ఛంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది' అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే పీపీఏల్లో లేని అవినీతిని ఎక్కడ నుంచి వెలికితీస్తారు అని నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్లు సక్రమంగా జరిగాయని... జగన్ నిర్ణయాలతో విద్యుత్ రంగంలో దేశ వ్యాప్తంగా పెట్టుబడులు వెనక్కి వెళ్తాయి అని కేంద్రం నుంచి లేఖలు వచ్చినట్లు పేర్కొన్నారు. 'ఎన్ని లేఖలు వచ్చినా.. నేను పట్టిన కుందేలుకి అసలు కాళ్లే లేవు అంటున్న జగన్ గారూ! వెకిలి వేషాలు మాని ముందు ప్రజల సమస్యలపై బుర్ర పెట్టండి' అంటూ ఘాటుగా ట్వీట్లు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని లేఖలను ఆయన ట్వీట్లకి చేర్చారు.

Intro:Ap_cdp_46_13_vybhavanga_sivakesavula_vedukalu_Av_Ap10043
పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకలో వెలసిన చెన్నకేశవ స్వామి, సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చంద్ర వాహనంపై సిద్దేశ్వర స్వామి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హంస వాహనంపై చెన్నకేశవ స్వామి ఊరేగింపు జరగాల్సి ఉండగా వర్షం కారణంగా గ్రామోత్సవం రద్దయింది. కాగా ఆలయానికి వచ్చిన భక్తులు మాత్రం హంస వాహనంపై ఆశీనులైన చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు. ఉదయం శివకేశవుల పల్లకీ సేవలు వైభవంగా జరిగాయి.

Body:వైభవంగా తాళ్ళపాక శివకేశవుల వేడుకలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.