చంద్రగిరిలో రీపోలింగ్‌పై ఈసీకి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో మరికొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలని అమరావతి ఈసీ కార్యాలయంలో ఇన్‌ఛార్జి సీఈవో సుజాతశర్మకు నక్కా ఆనందబాబు సహా పలువురు నేతలు వినతి పత్రం అందించారు.
మా ఫిర్యాదులు పట్టించుకోలేదు...
తమ ఫిర్యాదులు పట్టించుకోకుండా వైకాపా నేతల ఫిర్యాదులపై ఈసీ వేగంగా స్పందిస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. చంద్రగిరిలోని 5 చోట్ల రీపోలింగ్ నిర్ణయంపై తెదేపా నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
రాజ్యాంగ రక్షణకై తెదేపా ప్రయత్నం....
పోలింగ్ రోజున వైకాపా దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ఈసీని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం లేకున్నా తమ వంతు బాధ్యతగా ఫిర్యాదు చేశామన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తెదేపా కృషి చేస్తుందని ఆనందబాబు అన్నారు. ఏపీలో రెండోసారి రీపోలింగ్ జరిగిన దాఖలాలు లేవని తెదేపా నేతలు ఉద్ఘాటించారు.
అనుమానాలున్నాయి...!
సీఈవో ద్వివేది సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రెండోసారి రీపోలింగ్ నిర్ణయంపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-'భాజాపా, వైకాపా కమిషన్‌గా ఎన్నికల సంఘం..!'