రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచే ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అమరావతిలో వెల్లడించారు. కౌలు రైతులకూ ఈ పథకం వర్తించేలా విధివిధానాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరికైనా పొలంలో ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయిస్తుందని... వీటి కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోర్లు వేసే యంత్రాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం వివిధ సంస్థల నుంచి అప్పుగా తీసుకువచ్చిన 450 కోట్ల రూపాయల్ని గత ప్రభుత్వం దారి మళ్లించటం వల్లే రైతులకు ఆ డబ్బు అందలేదని కన్నబాబు తెలిపారు.
ఇదీ చదవండీ :