పత్రిక, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారని... ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ తెలిపారు. శాసనసభలోని సీఎం ఛాంబర్లో ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, సుబ్బారావు, చందు జనార్దన్ బృందం జగన్ ను కలిశారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం... వైకాపా విధానంగా పెట్టుకున్నట్లు సీఎం చెప్పారని... వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు పరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండీ...
మీ నాన్న పార్టీ మారిన చరిత్ర తెలుసా..?: చంద్రబాబు, చరిత్రలు చెప్పొద్దు: జగన్