ETV Bharat / state

కీలక ప్రకటనలకు జగన్ సమాయత్తం..!? - ఎల్వీ సుబ్రహ్మణ్యం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున కీలకమైన ప్రకటనలు చేసేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. నవరత్నాలతోపాటు ఆర్థిక క్రమశిక్షణపైనా ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎస్ అజయ్​కల్లాం ఇప్పటికే జగన్​కు కొన్ని వివరాలు సమర్పించినట్లు సమాచారం. పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరటంతో శాఖల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలియచేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్​కు నివేదికలు ఇచ్చారు.

వైఎస్ జగన్మోహన్​రెడ్డి
author img

By

Published : May 28, 2019, 12:56 PM IST

వైఎస్ జగన్మోహన్​రెడ్డి

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున కీలక ప్రకటనలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవరత్నాలతోపాటు నూతన అంశాలపైనా... జగన్ దృష్టిసారించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లపై... మాజీ సీఎస్ అజయ్​కల్లాం ఇప్పటికే జగన్​కు వివరించినట్లు తెలుస్తోంది. జగన్​తో సుదీర్ఘంగా భేటీ అయిన అజయ్​కల్లాం... రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు వివిధ శాఖలపై తీసుకోవాల్సిన కొత్త నిర్ణయాలపై చర్చించినట్లు సమాచారం.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖల వారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని జగన్​కు ఇచ్చారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత... ఇంకా కేంద్రం నుంచి రావాల్సింది ఎంత అనే వివరాలు ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా సీఎస్ జగన్​కు వివరాలు అందజేశారు.

ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున... తక్షణం తీసుకునే నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలని అధికారులు జగన్​కు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక జూన్ 1 నుంచి 5 వరకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి పూర్తిస్థాయి నిర్ణయాలు అమలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండీ...

అధికారుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్

Intro:ap_vja_10_28_ntr_jayanthi_javahar_fire_on_ycp_tiruvuru_avb_c3

వైకాపా అధినేత జగన్ నవరత్నాల పేరిట ప్రకటించిన 9 పథకాల్లో అధికారం లోకి రాకముందే మూడు పథకాలు ఎగిరిపోయాయి ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు కృష్ణా జిల్లా తిరువూరులో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు తిరువూరు మధిర రోడ్డు సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాలు నవరత్నాలు నకిలీ రత్నాలు త్వరలోనే తేలిపోతుందని తెలిపారు రాష్ట్రంలో అన్న వస్తున్నాడు అంటే హింస చేయడానికే వస్తున్నాడని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పథకాలు సమర్థవంతంగా అమలు జరిగేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు వైకాపా అధినేత జగన్ అధికార పగ్గాలు చేపట్టకముందే మేకలు బలి ఇచ్చి రక్తతర్పణ చేస్తున్నారని తాము ఎన్టీఆర్ కి పాలాభిషేకం తో శుద్ధి చేస్తున్నామని తెలిపారు

బైట్ వన్ కేఎస్ జవహర్ మాజీ మంత్రి

బైట్ టు నల్లగట్ల స్వామిదాసు మాజీ ఎమ్మెల్యే

Body:వైకాపా అధినేత జగన్ అధికార పగ్గాలు చేపట్టకముందే నవరత్నాలు పేరిట ప్రకటించిన తొమ్మిది పథకాలు మూడు ఎగిరిపోయాయి

నవరత్నాలో నకిలీ రత్నాలలో త్వరలోనే తేలిపోనుంది

మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.