ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సమయంలో ఎవరు ఎక్కడ పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్తపడుతున్నామని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది ఎంపిక తర్వాత రెండుసార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు చేపడతామని వివరించారు.
మే 23న ఉదయం ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు ఉంటుందన్న ద్వివేది... కౌటింగ్ ప్రారంభమయ్యే వరకూ పోస్టల్, సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన... టేబుళ్ల పెంపు కోసం విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదించాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి...