ETV Bharat / state

రేపు అనిల్ చంద్ర పునేఠా పదవీ విరమణ - takkar

మాజీ సీఎస్, ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ అనిల్ చంద్ర పునేఠా రేపు పదవీ విరమణ చేయనున్నారు. మరో మాజీ సీఎస్ సత్య ప్రకాశ్ టక్కర్ ఏపీ ఎకనామిక్ డెవలప్​మెంట్ బోర్డ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

'రేపే మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా పదవీ విరమణ'
author img

By

Published : May 30, 2019, 7:54 PM IST

'రేపే మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా పదవీ విరమణ'

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ బాధ్యతల నుంచి వైదొలిగిన పునేఠాను గత ప్రభుత్వం మినరల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ఎండీగా నియమించింది.

ఎస్పీ టక్కర్ తర్వాత అనిల్ చంద్ర పునేఠా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఐపీఎస్​ల బదిలీల వివాదంపై ఈసీ పునేఠాపై బదిలీవేటు వేసింది. దాదాపు నెలరోజుల పాటు ఎలాంటి పోస్టింగ్​లో లేని పునేఠాను... పదవీ విరమణ కంటే 10రోజుల ముందు ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు.

మరోవైపు ఏపీ ఎకనామిక్ డెవలప్​మెంట్​ బోర్డు చైర్మన్ పదవికి మాజీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ రాజీనామా చేశారు. ఇక విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజునుంచి ఉత్తర్వులు వర్తించనున్నాయని జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇవీ చూడండి-తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా జైన్​ పదవీ బాధ్యతలు

Intro:FILE NAME : AP_ONG_43_30_CHIRALA_BJP_SAMBURALU_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు పట్టణంలో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించిన భాజపా శ్రేణులు స్థానిక గడియార స్తంభం కూడలిలో నరేంద్ర మోదీ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు.

Body:చీరాలలో బిజెపి శ్రేణుల సంబరాలు

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.