చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌పై హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలైంది. ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌పై తెదేపా నేతలు అత్యవసర వ్యాజ్యం వేశారు. తెదేపా నేతల వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఇరువురి వాదనలు విని... విచారణ శనివారానికి వాయిదా వేసింది.
రామచంద్రాపురం మండలంలో 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా... వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతే లేదని ఈసీ తరపు న్యాయవాది వాదించగా... అర్హతపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీ చదవండి...