ETV Bharat / state

రాజకీయ పార్టీలు ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే ప్రధాన భూమిక అని... ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. నిన్న సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో  అఖిలపక్షాల భేటీ నిర్వహించిన ద్వివేది.. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా ప్రతులను అందజేశారు.

author img

By

Published : Mar 31, 2019, 4:54 AM IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలదే ప్రధాన భూమిక అని... ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. రాజకీయ పార్టీలు ఒకరి పై ఒకరు దురుద్దేశ పూర్వక వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేశామని తెలిపారు.నిన్న సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో అఖిలపక్షాల భేటీ నిర్వహించిన ద్వివేది.. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా ప్రతులను అందజేశారు. సామాజిక మీడియా ద్వారా జరుగుతున్న ఫిర్యాదులు, ఆరోపణలు సగానికి పైగా బోగస్ వేనని అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయాలతో పాటు ఇతర అంశాలనూ కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు గమనిస్తున్నారని వెల్లడించారు.రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 45వేల 717 ఓటర్లు నమోదు అయ్యారని తెలిపారు. కొత్తగా 25 లక్షల పైచిలుకు మంది ఓటర్లను నమోదు చేశామని వివరించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితా ఇస్తారని తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2395 మంది... 25 పార్లమెంటరీ స్థానాలకు 344 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్లు తెలిపారు. 15 మంది కంటే అదనంగా అభ్యర్ధులు ఉంటే అక్కడ మరో ఈవీఎంను వినియోగిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ, ప్రత్యేక పరిస్థితుల రీత్యా అదనంగా మరింత మంది పరిశీలకులు రాష్ట్రానికి రానున్నట్టు తెలిపారు. ఇప్పటికే 200 మందిని కేంద్ర ఎన్నికల సంఘం పంపగా... ఇందులో 75 మంది సాధారణ పరిశీలకులు.. 13 మంది పోలీసు పరీశీలకులు వచ్చారని స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులూ రానున్నట్టు తెలిపారు. ఈ పరిశీలకుల ఫోన్ నెంబర్లు ప్రతీ రాజకీయ పార్టీకీ ఇస్తామని చెప్పారు. తనకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందిస్తానని రాజకీయ పార్టీలకు ద్వివేది హామీ ఇచ్చారు.

Contributor : R.SampathKumar Centre : Guntakal, Anantapur Dist Date:30-03-2019 Slug:AP_Atp_23_30_janaseana_cpi_blame_to_ro_officer_Avb_C15 anchor:- అనంతపురంజిల్లా,గుంతకల్లు లో జనసేన,సీపీఐ అభ్యర్థులు ఎన్నికల అధికారి ప్రవర్తనపై మీడియా సమావేశం నిర్వహించారు.గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ,నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి గతంలో కుట్టు యంత్ర పరికరాలు తమ నివాసంలో ఉంచినట్లు పేర్కొన్నారు.ఇవాళ అవి ఎలక్షన్ ప్రచారంలో పంపిణీ చేస్తారని వచ్చిన వార్తతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి,పోలీసులు తమ ఇంటిపై సోదాలు జరపడం హేయమైన చర్య అని అన్నారు.తమకు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రచారంలో అడ్డుకుంటున్నారని,ఇతర పార్టీలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు.ఈవిషయంపై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.అనంతపురం పార్లమెంటు సీపీఐ అబ్యర్తి జగదీష్ మాట్లాడుతూ గుంతకల్లు లో జనసేన పార్టీ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యే పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు.తమ అధినేత పవన్ వచ్చినవుడు కూడా ఇలాంటి అడ్డంకులు సృష్టించారని, ఇలాంటి దుష్ప్రచారం, అడ్డంకులు ఆపాలని కోరారు. బైట్1:- కొట్రికే మధుసూదన్ గుప్తా జనసేన గుంతకల్లు అభ్యర్థి. బైట్2:- జగదీష్ సీపీఐ పార్లమెంటు అభ్యర్థి అనంతపురం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.