వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వాకం వల్లే ఆల్మట్టీ డ్యామ్ ఎత్తు పెంచారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు. ఆల్మట్టీ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు నాలుగు రాష్ట్రాల వాదనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని దేవినేని అన్నారు. రాష్ట్రం కోసం తెదేపా ప్రభుత్వం ఎంత కష్టమైనా లెక్కచేయదన్నారు. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న తెలంగాణ నేతలతో జగన్ చేతులు కలిపారని దేవినేని మండిపడ్డారు.
ఇదీ చదవండి