ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం సచివాలయంలో 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది, డీజీపీ ఠాకూర్, ఐటీ అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద భద్రత, పోలింగ్ కేంద్రాల వరకు ఈవీఎం యంత్రాలు, సిబ్బంది తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ నాలుగు రోజులు తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓటర్ల వసతి ఏర్పాట్లపై సూచించారు.
ఇదీ చదవండి