ETV Bharat / state

విచారణ ముగిశాకే రాజధాని నిర్మాణంపై నిర్ణయం - Amaravati

రాజధాని అమరావతి నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్, భూ సేకరణ, రైతులకు స్థలాల కేటాయింపు, పలు నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగినట్లు ప్రాథమిక నిర్దరణకు వచ్చిన కమిటీ... పూర్తి విచారణ జరపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని నిర్ణయించింది.

రాజధాని అమరావతి నిర్మాణంపై సమీక్ష
author img

By

Published : Jun 26, 2019, 11:26 PM IST

రాజధాని అమరావతి నిర్మాణంపై సమీక్ష

సీఆర్డీఏ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏపై సీఎం జగన్ సమారు 3 గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. రాజధాని ప్రకటనకు ముందు జరిగిన భూ రిజిస్ట్రేషన్లు పరిశీలించారు. రాజధాని ప్రకటన అనంతరం భూసేకరణ ప్రక్రియ సహా స్థలాల కేటాయింపు, రైతులకు పరిహారం తదితర అంశాలపై చర్చించారు. మాస్టర్ ప్లాన్, ఇతర భవన నిర్మాణాల నమూనాను పరిశీలించారు.

రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహా... ఇతర దేశాల ప్రతినిధులతో కుదుర్చుకున్న ఒప్పందాలు పరిశీలించారు. వాటిలో లోపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, ఇతర భవనాల టెండర్ల ప్రక్రియలో లోపాలు గుర్తించినట్లు... మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజధాని వ్యవహారంలో పెద్ద కుంభకోణం ఉందన్న బొత్స... విచారణ ముగిశాకే రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని తమ ప్రభుత్వం అంగీకరించబోదన్న మంత్రి... బలవంతంగా లాక్కున్నారని ఎవరైనా వస్తే వారి భూమి తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

తెదేపాలోనే ఉంటా... వ్యక్తిగత పనులపై దిల్లీ వచ్చా

Intro:AP_TPG_12_26_IRAGAVARAM_RAITULA_DHARNA_AV_C1
( . )ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన ధాన్యానికి తమకు రావాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో రైతులు ఆందోళనకు దిగారు. Body:ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ధాన్యం సరఫరా చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకున్నవారు లేరని ధ్వజమెత్తారు. ప్రస్తుత పంటకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు . Conclusion:తమకు రావాల్సిన సొమ్ము వెంటనే విడుదల చేయాలని రైతులు కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.