ముఖ్యమంత్రి జగన్ మోహన్మోరెడ్డి ఇవాళ ఆయన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్..ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 8.10 గంటలకు కడప చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి సమీపంలోని గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన సీఎం జగన్... స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం సమీపంలో రూ.3 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు జగన్ చేరుకుంటారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 24 స్టాళ్లను సందర్శిస్తారు. రైతులతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ వేదిక నుంచి రైతు దినోత్సవం ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తారు. ఇక్కడి నుంచే వైఎస్సార్ పింఛన్ల పథకాన్ని కొందరు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జమ్మలమడుగులో సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకొని... ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడినుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు.
ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా సొంత జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కిరణ్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు.
ఇదీ చదవండీ...