ETV Bharat / state

తెలుగు విద్యార్థులకు న్యాయసహాయం అందించాలి: పవన్ కల్యాణ్

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించాలని పవన్ కల్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

తెలుగు విద్యార్థులకు న్యాయసహాయం అందించాలి: పవన్ కల్యాణ్
author img

By

Published : Feb 1, 2019, 9:37 PM IST

అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తీసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఆ దేశానికి ఎమ్ఎస్ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి కన్నవారు ఆందోళనలో ఉన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారనే సమాచారం బాధ కలిగిస్తోందన్నారు. అమెరికా ప్రభుత్వమే మిషిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి ట్రాప్ చేసి చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరమని తెలిపారు. ఈ విషయంలో ఇబ్బందులుపడుతున్న విద్యార్థులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఎన్నారై జనసేన ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

Intro:భారతదేశంలో పట్టణాలకే కాకుండా గ్రామాలు కుగ్రామాలకు సైతం సాంకేతిక పరిజ్ఞానంతో భారత ప్రభుత్వ తపాలా శాఖ సేవలు అందిస్తోందని పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పి ఎల్ ఐ డే సందర్భంగా పొదుపు - బీమా మహా మేళా నార్త్ సబ్ డివిజన్ సూపరిండెంటెంట్ కె వెంకటేశ్వరరావు, ఐ పి ఓ గౌరీస్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు..

Body:విశాఖపట్టణం నార్త్ సబ్ డివిజన్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ విశాలాక్షి నగర్ డైరీ ఫార్మ్ మధురవాడ భీమిలి పద్మనాభం చిట్టివలస ఆర్ పి అగ్రహారం తదితర సబ్ పోస్ట్ ఆఫీస్ ల నుండి 55 మంది బ్రాంచ్ పోస్టుమాస్టర్ లు పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథి పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పి ఎల్ ఆర్ పి ఎల్ ఐ సేవింగ్,రికరింగ్ ఖాతాలతోపాటు , ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలను సైతం తపాలాశాఖ నిర్వహిస్తోందన్నారు సాయి లోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలను వినియోగించుకోవాలని సూచించారు

Conclusion:గ్రామంలో ఉన్న పోస్టాఫీసులు ప్రజల వద్దకు వెళ్లి తపాలాశాఖ కార్యకలాపాలను వారి ముంగిట ఉన్నారు ఆర్థిక వనరులు చేసి తాము తీసుకున్న వేతనాలకు న్యాయం చేయాలన్నారు ఈ సందర్భంగా పలు పంచాయతీలలో ఉత్తమ సేవలందించిన bpm లకు మెమెంటోలతో సన్మానించారు. అక్రమ లో విశాఖ నార్త్ సబ్ డివిజన్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
బైట్: డాక్టర్ యం వెంకటేశ్వర్లు పోస్ట్ మాష్టర్ జనరల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.