పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. 2 వేల 656 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. భారత్ పవర్ లిమిటెడ్ పేరుతో 3 నాన్ బ్యాంకింగ్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నట్టుగా గుర్తించారు. 948 కోట్ల రూపాయల మొత్తం రుణఎగవేతకు పాల్పడినట్లు ఆర్థిక సంస్థలు చేసిన ఫిర్యాదుపై.. వివరాలు తెలుసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ల నుంచి 2 వేల 656 కోట్లు రుణాన్ని రఘురామ కృష్ణంరాజు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. విలువైన దస్త్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు స్వాధీనం చేసుకుని.. కృష్ణంరాజు వాంగ్మూలం నమోదు చేశారు.
ఇదీచదవండి