విజయనగరం జిల్లాలో ప్రజాదర్బార్ సభలో వేదికపైకి వచ్చిన వృద్ధురాలు పెంటమ్మ ప్రేమను చూసి మురిసిపోయారు. ఆ వృద్ధురాలు మాటలకు పులకించిపోయిన బాబు..ఆ పెద్దావిడకు పాదాభివనందం చేశారు. మళ్లీ తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని వంగి కాళ్లకు మొక్కారు. ఈ సన్నివేశాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోడ్డుషోలో ఓ పెద్దవిడను ప్రేమతో పలకరించారు చంద్రబాబు. ఎండలో వచ్చావు తల్లి అంటూ వాహనంపైకి పిలిపించుకున్నారు. పెన్షన్ వస్తుందా అని అడగ్గా..కొడుకులు కూడా ఇవ్వట్లేరు..మీరు రెండువేలు ఇస్తున్నారని చెప్పిందావిడ. ఆమె మాటలకు పరవశించిపోయిన బాబు..పెద్దకొడుకులా ఉంటానమ్మా అంటూ భరోసా ఇచ్చారు.
అనంతపురం జిల్లా ప్రచారంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో వృద్ధురాలు నర్సమ్మ ఉత్సాహానికి మైమరిచిపోయారు. ఆమెను వేదికపైకి పిలిపించుకున్నారు. బాగోగులు అడిగి తెలు తెలుసుకున్నారు చంద్రబాబు. నీవల్లే నేను బతికున్నా సామీ’ అంటూ చంద్రబాబును నర్సమ్మ కౌగిలించుకుంది. దీంతో సభావేదిక ఒక్కసారిగా చప్పట్లు, ఈలలతో దద్దరిల్లింది. నేనున్నా నీకంటూ అభయమిచ్చిన ముఖ్యమంత్రి ఆమెను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగారు.
అనంతపురం జిల్లాలో అమరావతి నిర్మాణానికి విరాళమిచ్చిన వృద్ధురాలి కాళ్లు మొక్కారు చంద్రబాబు. పెన్షన్ సొమ్ము ఇచ్చిన ఇంకో పెద్దవిడకు సభా వేదికపై కాళ్లకు నమస్కరించారు. కాకినాడలో నవ నిర్మాణ దీక్ష ముగింపు సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రేమగా దగ్గరికి వచ్చి పలకరించిన ఓ వృద్ధురాలిని ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. చంద్రబాబుపై ఆమె పాడిన పాటకు పరవశించిపోయారు. ఇలా పెద్దలను పలకరిస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు చంద్రబాబు.
తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 50లక్షలకు పైగా వృద్ధాప్య ఫించన్లు ఇస్తోంది. ప్రతీ నెలా 2వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతుండటంతో సానుకూలత కనిపిస్తోంది. అది ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిఫలిస్తోంది.