తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామపంచాయతీ పరిధిలో గల ధ్యాన కేంద్రంలో బాబూజి మహారాజ్ జయంతి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన 25 వేల మంది మధ్య కూర్చొని ఆమె ధ్యానం చేశారు. అనంతరం కమలేష్ డీ పాటిల్ను కలిసి మాట్లాడారు. స్వామీజికి సంబంధించిన పుస్తకాలను భక్తులకు పరిచయం చేశారు. వీటిని చదవడం వల్ల జ్ఞానంతో పాటు ప్రశాంతత వస్తుందనని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: