తన ప్రయాణికులకు చల్లదనం పంచేందుకు ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఆటో టాప్‌ను నర్సరీలా మార్చేశాడు. పర్యావరణానికి మేలు చేకూరుస్తూనే చల్లదనాన్ని పొందవచ్చు అనే అతని ఐడియాకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఇతని ఆటో ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చూడటానికి "నేనాటోవాడ్ని.. ఆటోవాడ్ని.. అన్నగారి రూటు వాడ్ని'' అంటూ బాషాలో రజనీకాంత్‌లా కనిపిస్తున్నప్పటికీ.. ఇతను మాత్రం మన తెలుగువాడేనని అనటంలో సందేహం లేదు. ఫోటో ఏ ఊరిలోదో తెలియకపోయినా అతని ఆలోచన మాత్రం అబ్బురపరుస్తోంది. సృజనాత్మకతతో పని చేయటానికి గొప్ప గొప్ప చదువులే అక్కర్లేదు. సాధారణ ప్రజల్లోనూ, చిన్నచిన్న వృత్తుల్లోనూ కూడా కళాత్మకంగా, సృజనశీలతతో సేవలు అందించవచ్చని ఈ ఆటోవాలా నిరూపించాడు.
ఆటోవాలా చల్లని ఐడియా.. నెటిజన్లు ఫిదా - green
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ, కూలర్ వంటి వాటిని ఆశ్రయిస్తాం. ఓ డ్రైవర్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా తన ఆటోపైనే మొక్కలు పెంచేసి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.