ETV Bharat / state

ఎన్నికల సంఘానికి... మంత్రివర్గ సమావేశ అజెండా! - cabinet meeting

ఈ నెల 14న జరగాల్సిన మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది.

ఎన్నికల సంఘానికి... మంత్రివర్గ సమావేశ అజెండా!
author img

By

Published : May 10, 2019, 12:07 AM IST

Updated : May 10, 2019, 12:24 AM IST

ఈ నెల 14న జరగాల్సిన మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరో కీలక అడుగు పడింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఆ వివరాలను ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లనున్నాయి. ఈ అంశాలను ఎన్నికల సంఘం ఆమోదిస్తేనే... కేబినెట్ సమావేశంలో చర్చకు వస్తాయి.

నాలుగు అంశాలపై స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. రాష్ట్రంలో ఫోని తుఫాన్ ప్రభావం నష్టం, తాగునీటి ఎద్దడి, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీల ఇబ్బందులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు తో సీఎస్ నేతృత్వంలోని బృందం చర్చించి తదుపరి ఆమోదం కోసం ఈసీకి పంపారు. అజెండాలోని అంశాలపై ఈసీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదం తెలిపితే మంత్రిమండలి సమావేశ నిర్వహణకు ఆటంకాలు తొలగినట్టేని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కారణంగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తప్పనిసరైంది.

Patna (Bihar), May 09 (ANI): While speaking to ANI, Union Minister of State (Independent Charge) for Ministry of Micro, Small and Medium Enterprises Giriraj Singh expressed his views on Opposition reactions Prime Minister Narendra Modi's remark on Rajiv Gandhi. Singh said, "Congress should have strength to hear the truth. They don't have the strength and that is why they're saying that they have problem with these questions." He further expressed his views on 'stupid' PM remark. He said, "The more they abuse the PM, the more strength it is giving to him."
Last Updated : May 10, 2019, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.