ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ కు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయటంతో ఆ బాధ్యతలను కుమార్ విశ్వజిత్ కు అప్పగించారు. తాజాగా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ అదనపు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో కుమార్ విశ్వజిత్ రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
ఇదీ చదవండి