రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. రైతులును ఇబ్బందిపెట్టిన అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. బదిలీ అయినా, ఉద్యోగ విరమణ చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఐ నుంచి కలెక్టర్ వరకూ.. ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు. రైతులను మోసం చేసినట్లు ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని.... అవసరమైతే సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసి సమస్య పరిష్కరిస్తామన్నారు.
ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామన్న చోట తెదేపా ఎందుకు ఓడిందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని... అది ఇక్కడే ఉంటుందన్నారు. రాజధాని కాబట్టే సీఎం జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్నారని స్పష్టతనిచ్చారు. ల్యాండ్ పూలింగ్‌కి తీసుకున్న భూముల వివరాలు బయట పెడతామని చెప్పారు. కొండవీటి వాగు ప్రాజెక్టుకు రూ.46 కోట్లు అయితే 246 కోట్లుగా లెక్కల్లో చూపారని ఆరోపించారు.
ఇదీ చదవండి