భారత వాయుసేన వింగ్ కమాండర్ దేశభక్తి అనిర్వచనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. పాక్ సైనికులకు చిక్కి శరీరం రక్తమోడుతున్నా... అతనిలో ధైర్యం చెక్కుచెదరలేదని ప్రశంసించారు. అభినందన్ దేశభక్తి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన యావత్ భారతావని అండగా నిలబడాలని సూచించారు. సరిహద్దుల్లో సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. కేంద్రంలో పాలకులు బాధ్యతాయుతంగా ఉండాలని , ఒక వ్యక్తి నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్ధారిస్తాయని, ఏక పక్షంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని అన్నారు. రాజకీయ లాభాలు చూడకుండా దేశ సార్వభౌమాధికారాన్ని , సమగ్రతను కాపాడాలన్నారు.
ఇదీ చదవండి