ETV Bharat / state

YSRCP Leader: వాటర్ ట్యాంక్ ఎక్కి వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Apr 30, 2023, 2:02 PM IST

YSRCP Leader Suicide Attempt: బాపట్ల జిల్లా అద్దంకిలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ వైసీపీ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్‌ పదవి ఆశించి భంగపడటంతో.. వాటర్‌ ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అతనిని కిందకు దింపి స్టేషన్‌కు తరలించారు. ఇంతకీ అతను ఎవరంటే?

YSRCP Leader Suicide Attempt
వైసీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నం

వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన వైసీపీ నేత

YSRCP Leader Suicide Attempt: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని యార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కాడు ఏ వైసీపీ నేత. తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదని, దళితుడిని అనే కారణంతోనే తనకు గుర్తింపు లేదని ఆరోపించారు.

బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వేలమూరిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జ్యోతి రోశయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో నిరాశ చెందిన రోశయ్య.. ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో మార్కెట్ యార్డులోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోశయ్యని.. స్థానికుల సాయాంతో కిందకు దింపారు. అనంతరం అక్కడ నుంచి అతనిని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావటంతో.. రోశయ్య చైర్మన్ పదవి కోసం ఆశపడ్డాడు. అయితే అది దక్కదని తలచి.. తాను ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యాడు. స్థానిక వైసీపీ నేత కృష్ణ చైతన్య తనను పట్టించుకోవటం లేదని.. జగన్ మోహన్ రెడ్డి చెప్పినా సరే తనకు ఏ పదవి ఇవ్వడం లేదని అక్కసు వెళ్లగక్కారు.

పార్టీ మీటింగ్​లలో సైతం నన్ను గుర్తించటం లేదని, పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్​రెడ్డి పాదయాత్ర సమయంలో అద్దంకి నుంచి పాల్గొన్నానని.. చివరి వరకూ జగనన్నతో కలిసి పాదయాత్ర చేశానని.. అందుకే తనను పాదయాత్ర రోశయ్య అంటారని తెలిపారు. తాను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా అర్హుడినని.. అందుకే తనకు ఆ పదవి ఇవ్వాలని కోరాను.. అయితే వారు ఆ పదవిని వేరే వాళ్లకు కట్టబెడుతున్నారని తెలిసి కలత చెంది ఈ చర్యకు సిద్ధమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను జగనన్నతో నడిచి కూడా.. ఏ పదవీ లేదు. ఏదైనా మీటింగ్ అప్పుడు కనీసం నన్ను స్టేజీ మీదకు కూడా పిలవడం లేదు. ఒక దళితుడిగా నేను ఎంతో బాధ పడుతున్నాను. నేను కష్టపడ్డాను. కానీ నాకు ఇక్కడ ఎటువంటి గుర్తింపు లేదు. పార్టీ పదవి నాకు ఒక్కటి కూడా లేదు. ఛైర్మన్ పదని నేను అడుగుతున్నాను. సీఎంని కూడా అడిగాను. వెంటనే చైతన్య గారితో కూడా మాట్లాడి ఈ సీనియర్​కి పరిశీలించి పదవి ఇమ్మని చెప్పారు". - జ్యోతి రోశయ్య, వైసీపీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.