ETV Bharat / state

మడ అడవుల విస్తీర్ణంలో తగ్గుదల... జీవ వైవిధ్యానికి ప్రమాద ఘంటికలు.. - మడ అడవుల విస్తీర్ణంలో తగ్గుదల

బాపట్ల జిల్లా సముద్ర తీరంలో మడ అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో... జీవ వైవిధ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. స్వార్థంతో కొందరు మడ అడవులను ధ్వంసం చేసి చేపల చెరువులుగా మారుస్తున్నారు. దీంతో అరుదైన జీవరాశులు ఆవాసాలు కోల్పోతున్నాయి.

మడ అడవులు
మడ అడవులు
author img

By

Published : May 1, 2022, 6:04 AM IST

బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి లంకెవానిదిబ్బ వరకు 94.9 చదరపు కి.మీ. విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించాయి. రేపల్లె అటవీ రేంజ్‌ పరిధిలో 44 శాతం, కృష్ణా అభయారణ్యం కింద మిగిలిన 46 శాతం ఉన్నాయి. తీర ప్రాంతాన్ని సునామీ వంటి ప్రకృతి విపత్తులు నుంచి రక్షించటంతో పాటు తుపాన్ల సమయంలో పెనుగాలుల తీవ్రతను మడ అడవులు తగ్గిస్తాయి. సముద్ర ఆటుపోట్లకు భూమి కోతకు గురవకుండా కాపాడటంతో పాటు, వన్యప్రాణులకు ఈ మడ అడవులు నెలవుగా ఉంటున్నాయి.

మేలు చేసే మడ అడవుల్ని కొందరు తమ స్వార్థం కోసం నాశనం చేస్తున్నారు. మడ అడవుల్లోని చెట్లను నరికేయడం, మరికొందరు చేపల చెరువులుగా మార్చివేయటం వల్ల నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. అధికారుల అంచనా ప్రకారం 1500 హెక్టార్లకుపైగా మడ అడవులు ఆక్రమించి చెరువులుగా తవ్వారు. ఈ చర్యల వల్ల తీర ప్రాంతానికి సహజరక్షణకు తూట్ల పడటంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. దీనికి తోడు ఆక్వా కలుషితాలతో కొన్ని రకాల జంతువులు, పక్షులు కనుమరుగై పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే జీవవైవిధ్యం దెబ్బతిని.. 30 శాతం జీవరాశులు తగ్గిపోయాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

సముద్ర తీరంలో మడ అడవుల అభివృద్ధికి ఎంఎస్‌. స్వామినాథన్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. మడ అడవుల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్రం 2007లో నిజాంపట్నం వద్ద 70 హెక్టార్లలో వీటి అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. మడ విస్తీర్ణం తక్కువగా ఉన్న అటవీ భూముల్లో మొక్కలు నాటి సంరక్షించి అటవీశాఖాధికారులు అడవిని పెంచారు. చిత్తడి నేలలు, మడ అడవుల అభివృద్ధికి 2019లో 80 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు.. త్వరలో నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

లంకెవానిదిబ్బ, దిండి ప్రాంతంలోని మడ అడవుల్లో నీటి పిల్లుల సంచారం ఎక్కువగా ఉంది. ఉప్పునీటి ఆవాసంలో మాత్రమే సంచరించే అరుదైన క్షీరదాలు ఇవి. మడ అడవుల్లో సముద్ర కొంగలు, గద్దలు, హెరాన్స్‌, సీవేడర్స్‌, నైట్‌ హెరాన్స్‌ తదితర అరుదైన పక్షి జాతులున్నాయి. విదేశాల నుంచి వివిధ రకాల పక్షులు తీర ప్రాంతానికి వలస వస్తుంటాయి. మన సముద్ర తీర ప్రాంతంలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు కూడా ప్రత్యేకం. ఏటా జనవరి నుంచి మార్చి వరకు తీర ప్రాంతానికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి వెళ్తుంటాయి. ఇలాంటి వాటిని రక్షించుకోవటం.. కేవలం మడ అడవులతోనే సాధ్యమని పర్యావరణవేత్తలు అంటున్నారు.

ఇదీ చదవండి: AP HRDI: హెచ్‌ఆర్‌డీఐ సంస్థ.. గుట్టు చప్పుడు కాకుండా విశాఖకు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.