CHALLENGES BETWEEN TDP-YSRCP : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు వెేడెక్కుతున్నాయి. అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు వైసీపీకి సవాల్ విసిరారు. ఆయన సవాల్‌పై మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. ఆనంద్ బాబు విసిరిన సవాల్‌పై చర్చకు సై అన్నారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు.. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్వహించిన ఆందోళనలో వైసీపీకి సవాల్ విసిరారు. ఏ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించిందో చర్చకు రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. బడ్జెట్లో తెలిపిన వివరాల ప్రకారం కేవలం 32 శాతాన్ని మాత్రమే సంక్షేమానికి వైసీపీ ఖర్చు పెట్టిందని అన్నారు. చంద్రబాబు హయాంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇదే సంక్షేమానికి 45 శాతాన్ని సంక్షేమం కోసం ఖర్చు చేసిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎవరు చర్చకు వస్తారో రావాలని అన్నారు. సంక్షేమానికి అధికంగా ఖర్చు చేసిన ప్రభుత్వ టీడీపీ అని పేర్కొన్నారు.
కేవలం సాధారణ చర్చ మాత్రమేనని.. పోలీసులు, కార్యకర్తలు, ధర్నాలు హడావుడి లేకుండా కూర్చోని చర్చిద్దామని అన్నారు. సవాల్, ప్రతిసవాళ్లు వద్దని కేవలం చర్చలు మాత్రమేనని.. ఎవరు వస్తారో రావాలన్నారు. ఎమ్మెల్యే వస్తారో, మంత్రి వస్తారో రండి అని.. గొడవలు, దాడులు అవసరం లేదని, అలా చేసి అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఆంశంలో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. చివరకి వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అయినా చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కార్యకర్తలు లేకుండా.. పురవీదుల్లో కూర్చోని చర్చించుకుందామని మంత్రి మేరుగు నాగార్జునకు సవాల్ విసిరారు.
స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున : నక్కా ఆనంద్ బాబు సవాల్‌కు.. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. గతంలో కూడా సవాళ్లపై చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపినట్లు గుర్తు చేశారు. తాను ఎప్పుడైనా చర్చలకు రెడీ అని అన్నారు. చర్చకు ఎవరు వస్తారో రండి అని.. ఆనంద్ బాబు వస్తారో, చంద్రబాబు వస్తారో రావాలని ప్రతి సవాల్ విసిరారు. మీరు చెప్పినా ప్రదేశం, సమాయానికే చర్చకు వస్తానని దానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈ నాలుగు సంవత్సరాలలో వేమూరు నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు తీసుకువచ్చామో, ఏ విధంగా ఖర్చు చేశామో చర్చించటానికి సిద్ధమని అన్నారు. ఇతర పథకాల కింద ఎన్ని కోట్ల రూపాయలు నియోజకవర్గానికి తీసుకువచ్చానో, రోడ్లకు, అభివృద్ధికి, తీసుకువచ్చిన, తీసుకురాబోతున్న వాటిపై బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
"ఏ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించిందో వైసీపీ చర్చకు రావాలి. బడ్జెట్లో తెలిపిన వివరాల ప్రకారం కేవలం 32 శాతాన్ని మాత్రమే సంక్షేమానికి వైసీపీ ఖర్చు పెట్టింది. చంద్రబాబు హయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇదే సంక్షేమానికి 45 శాతాన్ని సంక్షేమం కోసం ఖర్చు చేసింది. అభివృద్ధి, సంక్షేమంపై ఎవరు చర్చకు వస్తారో రావాలి. సంక్షేమానికి అధికంగా ఖర్చు చేసిన ప్రభుత్వ టీడీపీ." - నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
"గతంలో కూడా సవాళ్లపై చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపాను. నేను ఎప్పుడైనా చర్చలకు రెడీ. చర్చకు ఎవరు వస్తారో రండి ఆనంద్ బాబు వస్తారో, చంద్రబాబు వస్తారో. మీరు చెప్పినా ప్రదేశం, సమాయానికే చర్చకు వస్తాను. దానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నాలుగు సంవత్సరాలలో వేమూరు నియోజకవర్గానికి ఎన్ని డబ్బులు తీసుకువచ్చాను, ఏ విధంగా ఖర్చు చేశామో చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. అభివృద్ధికి, తీసుకువచ్చిన, తీసుకురాబోతున్న వాటిపై బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నా." - మేరుగు నాగార్జున, రాష్ట్ర మంత్రి
ఇవీ చదవండి :