ETV Bharat / state

పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన

Khudiram Bose Movie Special Show : పార్లమెంట్​ సభ్యుల కోసం నేడు ఖుదీరామ్​ బోస్​ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఆఫ్​ ఇండియాలో ప్రదర్శితమైంది.

khudiram bose
ఖుదీరామ్ బోస్
author img

By

Published : Dec 22, 2022, 5:40 PM IST

Khudiram Bose Movie Special Show : ఈరోజు మ‌నం అనుభ‌విస్తున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం ఎందరో మ‌హ‌నీయులు వారి ప్రాణాల‌ను తృణప్రాయంగా త్య‌జించారు. వారంద‌రిదీ ఒక్కో చ‌రిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒక‌రు. దేశం కోసం చిన్న వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసి అమ‌రుడ‌య్యారు ఖుదీరామ్ బోస్‌. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించ‌గా.. చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. దాంతో నేడు సాయంత్రం 6 గంటలకు ‘ఖుదీరామ్ బోస్‌’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. న్యూ దిల్లీ మహదేవ్‌ రోడ్‌లోని ఫిల్మ్​ డివిజన్‌ ఆడిటోరియంలో ఈ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి ఫిల్మ్​ డివిజన్‌ అన్ని ఏర్పాట్లను చేయాలని మినిస్టరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్​ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్‌ ఇందు ఆదేశాలను జారీ చేశారు.

జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.వి.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జితా విజ‌య్ జాగర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగ‌ర్ల‌మూడి టైటిల్ పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి, స్టంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ల్ క‌న్న‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌సూల్ ఎల్లోర్, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె.వెంక‌టేశ్​ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌గా.. బాలాదిత్య రైట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.