Short Circuit: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఎస్ఎల్ గుడిపాడు గ్రామంలో ఆలకుంట నాగేశ్వరరావు అనే రైతు పొలంలో విద్యుత్ తీగలు రాసుకుని బొప్పాయి తోట ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో చెట్లకు నీరు సరఫరా చేసే పైపులు, సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న బొప్పాయి చెట్లు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: Protest on Power cuts: విద్యుత్ కోతలపై.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు