ETV Bharat / state

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

author img

By

Published : Feb 7, 2023, 5:27 PM IST

Student died due to gun misfire: ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థి అక్కడ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటనలో బుల్లెట్ విద్యార్థి తలలోకి దూసుకెళ్లింది. విద్యార్థి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో సొంత గ్రామం మధిరలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Telangana student dies in America
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

Student died due to gun misfire: అమెరికాలో తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. మరోవైపు అక్కడికి సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు.

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయింది. అఖిల్‌ సాయి తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్‌ మృతి చెందాడు. అఖిల్‌ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.