ETV Bharat / state

పేకాట రాజధానిగా తయారు చేశారు: నాదెండ్ల మనోహర్ - ఏపీ రోడ్ల పరిస్థితి

JSP Nadendla Manohar: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 17, 2023, 2:08 PM IST

పేకాట రాజధానిగా తయారు చేశారు: నాదెండ్ల మనోహర్

JSP Nadendla Manohar: వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తలకు సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజధానిని పేకాట రాజధానిగా తయారు చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు అక్రమంగా దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్దిలో లేదన్నారు. వ్యక్తగత లాభం కోసం ఆలోచిస్తున్నారనీ అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థతి మరింత దారుణాతి దారుణంగా ఉన్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలను దళారుల కేంద్రాలుగా మార్చేసారని ఆరోపించారు. రేపల్లె నియోజకవర్గాన్నిపేకాట క్లబ్​కు కేరాఫ్​గా మార్చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే జనసేన అధికారంలోకి రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జనసేన పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

" పేకాట క్లబ్​లు పెట్టి ఇది పేకాట రాజధానిగా తయారు చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు కృష్ణా, గుంటూరు జిల్లాలో అందరికి తెలుసు నియోజకవర్గంలో పేకాట బ్రహ్మడంగా జరుగుతున్నాయని అందరికి తెలుసు. ఇంత అహంకారం దేనికి ప్రజలు మిమల్ని మంచి పరిపాలన అందిస్తారు ఒక మార్పు తీసుకురాగులుగుతారనీ నమ్మకంతో మిమల్లి ఎన్నకుంటే మీరు చేసింది ఏంటీ ఈ ప్రాంతానిరి చెప్పిండి. పరిశ్రమలు తీసుకువచ్చారా, ఉపాధి కల్పించారా, కనీసం రోడ్లు వేశారా రోడ్ల దుస్థితి రేపల్లె నియోజకవర్గంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నేను ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో కేవలం వాళ్లుకు ఎటువంటి లబ్ధి జరుగుతుందని వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నారు గానీ ప్రజలు కోసం పరిపాలన చేయడం లేదు. " - నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.